ఖో-ఖో పోటీల్లో ప్రతిభ చాటిన నూకపెల్లి విద్యార్థినులు
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 ఖో-ఖో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని కళాశాల కీర్తిని ఇనుమడింపజేశారు. గెలుపొందిన విద్యార్థులకు ఎస్జీఎఫ్ సెక్రటరీ బన్సీలాల్ చేతుల మీదుగా నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. విద్యార్థుల విజయంపై ప్రిన్సిపాల్ ఆదిత్య, పీడీ రమేష్ హర్షం వ్యక్తం చేశారు.