బీఎంసీ కమిషనర్ అశ్విని భిడేకు సుప్రీంకోర్టు షాక్: ధిక్కరణ నోటీసులు జారీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించడంలో విఫలమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని భిడేకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఆమెపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో పాటు జీతం నిలిపివేసి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో అధికారులు కుమ్మక్కయ్యారని అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోరివలిలో బస్సు నిలయం కోసం కేటాయించిన స్థలంలో ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది అని అధికారులు తెలిపారు.