వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్ సందీప్ కుమార్
రిపోర్టర్: రమేష్
స్థలం: జనగామ
వేసవిలో ఎల్నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాల పరిశీలన కోసం ఈ నెల 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.