వైద్యుల గైర్హాజరీపై సర్కార్ కొరడా: డెబ్బై మంది ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్ల తొలగింపు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

అనుమతులు లేకుండా ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న డెబ్బై మంది వైద్యులను సర్వీసుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీస్పై దృష్టి పెట్టే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరో నూట తొంభై మూడు మందిపై శాఖాపరమైన విచారణ చేపట్టి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.