రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: డోర్ టు డోర్ పార్సిల్ సేవలు ప్రారంభం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
రైల్వే పార్సిల్ సేవలను మరింత సులభతరం చేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు మరియు వ్యాపారుల ఇబ్బట్లను తగ్గించేందుకు డోర్ టు డోర్ పార్సిల్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. రైల్ పార్సిల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి పార్సిల్‌ను సేకరిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు.