ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: దిల్లీ
దేశంలో ఎన్నికల వ్యవస్థను నాశనం చేసినందుకు భవిష్యత్తులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించి జైలుకు పంపుతామని లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. దిల్లీలోని రామ్లీలా మైదాన్ లో జరిగిన ఇండీ కూటమి భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. దేశంలో ఓట్ల చోరి జరుగుతోందని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు.