ఎన్టీఆర్ జిల్లాలో డ్రోన్ల ద్వారా గంజాయి నిర్మూలన అవగాహన
రిపోర్టర్: విజయ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యాట్రిక్స్ ఫోర్ టీ డ్రోన్ సహాయంతో గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం అందిస్తే బహుమతి అందజేస్తామని అధికారులు తెలిపారు. మహిళా భద్రతపై కూడా ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.