భువనగిరి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
భువనగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తోటకూరి వెంకటేశం వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.