'కార్మికులకు మెరుగైన వైద్యమందించాలి': ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని కాసిపేట-2 ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి శ్రీరాంపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు రమేష్, రాజ్ కుమార్, క్రాంతి కుమార్, శ్రీనివాస్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి గనుల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని జీఎంను కోరారు.