ఇండోర్ ఘటన: మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్
రిపోర్టర్: గోపి
స్థలం: ఇండోర్
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గర్భా వేడుకలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ మండలాధ్యక్షుడు కమల్ చౌహాన్ పై కేసు నమోదైనట్లు ఏసీపీ రుబినా మిజ్వాని తెలిపారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన పార్టీ నగర అధ్యక్షుడు సుమిత్ మిశ్రా నిందితుడికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.