లంకెలపాలెం నుంచి సబ్బవరం వరకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

పెందుర్తి నియోజకవర్గంలోని పైడివాడ అగ్రహారం నుంచి లంకెలపాలెం వరకు ఆర్ అండ్ బి రహదారి నిర్మాణ పనులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చొరవతో ప్రారంభమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా గుంతలమయమైన రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఈ పనులతో ఉపశమనం కలగనుంది. ఇప్పటికే మొదటి విడతలో 2.5 కోట్ల రూపాయలతో అసకపల్లి వరకు పనులు పూర్తికాగా, రెండో విడతలో మరో 2.5 కోట్ల రూపాయలతో పెదముసిడివాడ వరకు పనులు చేపడుతున్నారు. మిగిలిన భాగాన్ని ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేయనున్నారు.