వడ్డిపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైకాపా శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం వడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి, పూజారి మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీటీసీ అభ్యర్థి విమల విజయం కోరుతూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.