బెంగాలీల ఆహారపు అలవాట్లపై మాట్లాడే హక్కు బాబేశ్వర్ బాబాకు లేదు

రిపోర్టర్: సురేష్ స్థలం: పశ్చిమ బెంగాల్

దుర్గా పూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తినడంపై బాఘేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకించారు. బెంగాల్ ప్రజలు ఏం తినాలనేది నిర్ణయించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. శాస్త్రి వ్యాఖ్యలు బెంగాల్ సంస్కృతిపై దాడిగా స్థానికులు మండిపడుతున్నారు.