పార్వతీపురం మన్యం జిల్లాలో మోడల్ పాఠశాల నిర్మాణానికి లేన్సమ్ గ్రూప్ ముందుకు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెదకంచూరులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ పాఠశాలను నిర్మించేందుకు లేన్సమ్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈనాడులో వచ్చిన కథనానికి స్పందించిన ఆ సంస్థ ఛైర్మన్ కూనపరెడ్డి ఉమేశ్ కుమార్, వైస్ ఛైర్మన్ శ్రీలత అధికారులతో కలిసి శిథిలమైన పాఠశాలను సందర్శించారు. గ్రామస్థుల సమ్మతితో స్థలసేకరణ చేసి నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.