కింగ్ చార్లెస్ తనను మోసం చేశారంటూ ప్రిన్సెస్ డయానా తమ్ముడు సంచలన ఆరోపణలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

ప్రిన్సెస్ డయానా తమ్ముడు చార్లెస్ స్పెన్సర్ కింగ్ చార్లెస్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. తన కొత్త జ్ఞాపకాల పుస్తక ప్రచారంలో భాగంగా 1997లో డయానా అంత్యక్రియలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కింగ్ చార్లెస్ తనను మానసికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు గ్యాస్‌లైటింగ్ చేశారని, బకింగ్‌హామ్ ప్యాలేజ్ స్పందన సరిగా లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.