అన్ని వర్గాలను కలుపుకొని ఆమనగల్లు అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేసిన మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 25 కోట్ల నిధులతో నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో భాగంగానే డబ్బాలను తొలగించినట్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ తెలిపారు. చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని, కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో అందరి సహకారం అందించాలని కోరారు.