జీహెచ్ఎంసీ క్రీడల్లో దుమ్మురేపి చాంపియన్‌షిప్ కొల్లగొట్టిన హెడ్ ఆఫీస్
రిపోర్టర్: saikiran
స్థలం: రాజేంద్రనగర్
ఐదు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన జీహెచ్ఎంసీ వార్షిక క్రీడా పోటీలు ముగిశాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా విజేతలకు కమిషనర్ ఘనంగా బహుమతులు అందజేశారు. ఉద్యోగులు విధులతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.