విజయవాడలో విషాదం: ఓటింగ్ కోసం వెళ్లిన ఓటరు గుండెపోటుతో మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయవాడ
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో సయ్యద్ అప్పలస్వామి కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ నాయకుడు కుర్రా శివయ్య కుమారుడు జగదీష్ తన భార్యతో కలిసి ఓటు హక్ కు వినియోగించుకునేందుకు ఆదివారం పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గేటు వద్దకు రాగానే గుండెపోటుతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు, ఓటర్లు ఆయనకు సీపీఆర్ చేసి ఆటోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.