ఏపీలో రూ.249 కోట్లతో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం.

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రూ.249 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 వైద్య ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఇందులో 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఏపీని ఆరోగ్యప్రదేశ్‌గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.