నాణ్యత లోపంతో ఏడాది తిరగకముందే గుంతలమయమైన బొబ్బిలి రోడ్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పారిశ్రామికవాడలో కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రహదారులు నాణ్యతా లోపంతో ఏడాది తిరగకముందే గుంతలమయంగా మారాయని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కృష్ణప్రసాద్ తెలిపారు. గుత్తేదారులు పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలు, మితిమీరిన బరువు కారణంగా గోతులు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత కారణంగా మరమ్మతులు అరకొరగా మారుతున్నాయని తెలిపారు.