గంగమ్మ దసరా ఉత్సవాలకు ఆహ్వానం: హాజరవుతానని హామీ ఇచ్చిన ఎంపీ ప్రసాదరావు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎస్ఆర్ పురం
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టులో వేంచేసిన శ్రీ ఆరిమాని గంగమ్మ ఆలయ దసరా మహోత్సవానికి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును ఆలయ పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు తప్పక హాజరవుతానని ఎంపీ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కమిటీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్ రాయల్, ఆలయ చైర్మన్ జలంధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.