ఢిల్లీలో భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

రిపోర్టర్: మహేష్ స్థలం: Delhi

ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి రేఖా గుప్త, నీటి నిల్వలను వెంటనే తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పంప్‌సెట్ల ద్వారా నీటిని బయటకు పంపేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.