సెప్టెంబరు 15న తెలంగాణ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ ప్రాథమిక కీ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ ప్రాథమిక సమాధానాల కీ సెప్టెంబరు 15న విడుదల కానుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 22,477 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత తుది కీ, ఫలితాలు వెలువడనున్నాయి.