'చెరువులో వినాయక నిమజ్జనం విషాదం': ఆరుగురు విద్యార్థులు మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ విషాదం చోటుచేసుకుంది. స్థానిక నేరేడు చెరువులో విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నరసింహరాజు, సుమంత్ రెడ్డి, గణేశ్, తేజ, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మృతి చెందగా, నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ జయప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.