తీవ్ర అలర్ట్: మురాసు తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను ఒంగోలు వద్ద తీరం దాటడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు నల్గొండ, వరంగల్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్ లో మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.