రైఫిల్ షూటర్ మేఘనకు అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా
రిపోర్టర్: రాము
స్థలం: బెంగళూరు
ప్రముఖ అంతర్జాతీయ రైఫిల్ షూటర్ మేఘనా సజ్జనార్‌కు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అండగా నిలిచారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని చదివి స్పందించిన ఆయుష్మాన్, ఎలాంటి పరిచయం లేకపోయినా ఆమెకు అత్యాధునిక రైఫిల్‌ను రహస్యంగా స్పాన్సర్ చేశారు. ఈ సహాయంతో మేఘన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్య పతకాలు సాధించారు. తాజాగా ఆమె తన దాతను బెంగళూరులో నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.