పీజీఐఎంఈఆర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చండీగఢ్
చండీగఢ్‌లోని ప్రతిష్టాత్మక పీజీఐఎంఈఆర్ సంస్థ 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 3 లోగా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.