మధ్యప్రదేశ్‌లో కల్తీసారా మరణాలపై మహిళల ఆగ్రహం, మద్యం దుకాణం ధ్వంసం
రిపోర్టర్: కిరణ్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన కల్తీసారా ఘటనలో 16 మంది మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. టీకమ్‌గఢ్ జిల్లా బంహోరి గ్రామంలో మహిళల నేతృత్వంలో ఆగ్రహంతో ఊగిపోయిన గుంపు లైసెన్సెస్ మద్యం దుకాణంపై దాడి చేసి ధ్వంసం చేసింది. దాదాపు 25 లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలను ధ్వంసం చేస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు.