మీనా కుమారి బయోపిక్‌లో సైఫ్ అలీ ఖాన్, త్రిప్తి డిమ్రి నటిస్తున్నారా?

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

దిగ్గజ నటి మీనా కుమారి, దర్శకుడు కమల్ అమ్రోహి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'కమల్ ఔర్ మీనా' చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, త్రిప్తి డిమ్రిలతో చర్చలు జరుగుతున్నాయి. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా వస్తున్న ఈ బయోపిక్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను కమల్ అమ్రోహి మనుమడు బిలాల్ అమ్రోహి నిర్మిస్తున్నారు.