అమెరికాలో హాలోవీన్ వేడుకల్ లో కాల్పుల బీభత్సం: నలుగురు మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికాలో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా జరిగిన వరుస కాల్పుల ఘటనల్ లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. డల్లాస్, అలబామా, డెలావేర్, అర్కాన్సాస్ ప్రాంతాలలో ఈ దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ హింసాత్మక ఘటనలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు వేగవంతం చేశారని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.