లంచ్ బ్రేక్‌లో ఇరవై డాలర్లతో లాటరీ గెలుచుకున్న మహిళ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Virginia
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఓ మహిళకు లంచ్ బ్రేక్ సమయంలో ఊహించని అదృష్టం వరించింది. కేవలం ఇరవై డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్‌కు ఏకంగా రెండు మిలియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు తెలిపారు. అయితే ఆ సంతోషాన్ని వెంటనే వ్యక్తంచేయకుండా, ఎవరికీ చెప్పకుండా ఆమె మళ్లీ విధులకు హాజరై తన పని పూర్తిచేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్నులు పోను సింగిల్ పేమెంట్‌లో కొంత మొత్తాన్ని ఆమె ఎంచుకున్నట్లు వెల్లడించారు.