వెస్టిండీస్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక కసరత్తు షురూ
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్న భారత్ జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్, రిషబ్ పంత్ పునరాగమనంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది.