తిరుమలలో వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం నిర్వహించిన టీటీడీ

రిపోర్టర్: గోపి స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రధారుడి చక్రస్నానం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్ర స్పర్శతో జలాలు పావనమయ్యాయి. గోవింద నామస్మరణలతో తిరుమల దివ్యక్షేత్రం మార్మోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించి తరించారు.