గువాహటి హోటల్ కాల్పుల నిందితుడు ఎన్కౌంటర్: పోలీసుల కాల్పుల్ లో ఘనాకాంత గొగోయ్ హతం
రిపోర్టర్: సురేష్
స్థలం: Guwahati
గువాహటిలోని హోటల్ లో ఐదుగురిని కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన ఘనాకాంత గొగోయ్ పోలీసు ఎన్కౌంటర్ లో హతమయ్యాడని అధికారులు తెలిపారు. శివసాగర్ కు తరలిస్తుండగా పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాపోరి చేటియా వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు అధికారికి కూడా గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.