ఖమ్మం జిల్లాలో ఎనిమిదిన్నర కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణాలకు అంకురార్పణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పందిళ్లపల్లి నుండి అనంతసాగర్ వరకు అలాగే మరో నాలుగు కోట్ల యాభై లక్షలతో జగన్నాథపురంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.