రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న ఎమ్మెల్యే
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.