సీతాఫలాల సాగుపై వాతావరణ ప్రభావం: మార్కెట్ కు భారీగా తగ్గిన పండ్ల రాక

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

వాతావరణ మార్పులు మరియు ఎల్నినో ప్రభావం కారణంగా సీతాఫలాల సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వ్యాపారులు తెలిపారు. సరైన వర్షాలు కురవకపోవడం మరియు ఎండల తీవ్రత పెరగడంతో చెట్ల పూత రాలిపోయి దిగుబడి భారీగా పడిపోయినట్లు వారు పేర్కొన్నారు. గతంలో రోజుకు సుమారు నూట యాభై మెట్రిక్ టన్నుల వరకు సరుకు రాగా, ప్రస్తుతం కేవలం ఎనభై మెట్రిక్ టన్నుల లోపే వస్తోందని, దీనివల్ల పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి కిలో మూడు వందల రూపాయల వరకు పలుకుతున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.