న్యూయార్క్ హార్బర్‌లో 3,000 డ్రోన్లతో 9/11 ఘన నివాళి
రిపోర్టర్: మహేష్
స్థలం: World
న్యూయార్క్ హార్బర్‌లో 9/11 దాడుల అమరవీరుల స్మృత్యర్థం దాదాపు 3,000 డ్రోన్లతో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్క బాధితుడికి ప్రతీకగా 2,977 లైట్లతో ట్విన్ టవర్స్ ఆకారాన్ని ఆకాశంలో ఆవిష్కరించారు. దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ భావోద్వేగ కార్యక్రమం చూపరులను కంటతడి పెట్టించింది.