చిన్నారుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పొదలకూరులో పోషణ మాసోత్సవాలు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
పొదలకూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వద్ద 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ ఎం. జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఉడికించిన గుడ్డు, పాలు అందిస్తున్నట్లు తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.