అంతర్జాతీయ సంస్థల్లో తక్షణ సంస్కరణలు అవసరమన్న విదేశాంగ మంత్రి జైశంకర్
రిపోర్టర్: సురేష్
స్థలం: New York
న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా పార్ట్నర్స్ ఫర్ మల్టీలేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడారు. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతల వల్ల ప్రస్తుత ప్రపంచ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాల్లో ఏకపక్ష ధోరణులు పెరగకుండా బహుళపక్ష విధానం మరింత బలంగా నిలబడాలని, అంతర్జాతీయ సంస్థలను మరింత పారదర్శకంగా మార్చేందుకు తక్షణ సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.