అంతర్జాతీయ ఉద్రిక్తతలు: మధ్యప్రాచ్యాన్ని దాటి అమెరికా, నాటో స్థావరాలపై ఇరాన్ క్షిపణి హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: Washington / Tehran
అమెరికా మరియు ఇజ్రాయెల్ తో మళ్లీ యుద్ధం జరిగితే మధ్యప్రాచ్యాన్ని దాటి దాడులు విస్తరిస్తాయని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసిందని కైహాన్ పత్రిక పేర్కొంది. సైప్రస్, గ్రీస్, రొమేనియా, ఇటలీలోని అమెరికా, నాటో సైనిక స్థావరాలు లక్ష్యంగా మారవచ్చని తెలిపారు. మరోవైపు మధ్యంతర ఎన్నికల తర్వాత సైనిక చర్య ఉంటే పెద్ద సంఖ్యలో ఇరాన్ ప్రజలను హతమారుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.