మంచిర్యాలలో నవంబర్ 3న ప్రతిభకు వేదికగా జిల్లా యువజనోత్సవాలు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు మంచిర్యాల కలెక్టరేట్లో నవంబర్ 3న ఉదయం పదకొండు గంటలకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు యువజన క్రీడల అధికారి తెలిపారు. పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. జానపద నృత్యం, గానం, చిత్రలేఖనం వంటి అంశాల్లో ప్రతిభ చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.