హైదరాబాద్లో భారీ చోరీ: క్యారెట్ లేన్ దుకాణంలో కిలోన్నర బంగారం దోపిడీ

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ మేడిపల్లిలోని క్యారెట్ లేన్ ఆభరణాల దుకాణంలో భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మాస్కులు ధరించి వచ్చిన ఏడుగురు దుండగులు కేవలం పదకొండు నిమిషాల్లోనే సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఐదువందల ఎనభై బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. ఫ్రాంచైజీ యజమాని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు.