సమస్యల పరిష్కారం కోరుతూ తాటిపాకలో వీఆర్ఏల మానవహారం

రిపోర్టర్: K NAGA SRINU స్థలం: రాజోలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె ఏడో రోజుకు చేరింది. ఇందులో భాగంగా రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల వీఆర్ఏలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మలికిపురం మీదుగా రాజోలు చేరుకుని, తాటిపాక సెంటర్లో సుమారు పది నిమిషాల పాటు మానవహారం నిర్వహించి తమ సమస్యలపై నిరసన తెలిపారు.