నవీ ముంబైలో దారుణం: మూడేళ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారం

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

నవీ ముంబైలోని కామోథేలో మూడేళ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బుధవారం విద్యార్థులను ఇంటికి దింపుతుండగా, చివరిగా మిగిలిన చిన్నారిని బస్సులోనే లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, శనివారం వరకు రిమాండ్‌కు తరలించారు.