పేట్ బషీరాబాద్ పోలీసుల తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ పరిధిలోని ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో బయోమెడికల్ వ్యర్థాలు దగ్ధమైనా పేట్ బషీరాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్పై సుమోటో కేసులు నమోదు చేసే పోలీసులు, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే అక్రమ గోదాముల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ షార్ట్ సర్క్యూట్ పేరుతో తూతూమంత్రంగా కేసులు మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.