తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రోరోగ్: ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు ముగిసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు రద్దయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో కొత్తగా కొన్ని ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.