ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని కాల్కాజీ మందిర్ సమీపంలో 17 ఏళ్ల బాలికపై పోలీసులమంటూ వచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో పరారీలో ఉన్న హేమంత్, ముకేష్ అనే ఇద్దరు సోదరులను హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సాకేత్ కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్న హేమంత్ లీగల్ పదజాలంతో బాధితురాలిని బెదిరించగా, అతని తమ్ముడు ముకేష్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే ఆసిఫ్ అనే నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌తో అరెస్టు చేయగా, తాజాగా ఈ ఇద్దరి అరెస్టుతో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కినట్లయింది.