రష్యా సైన్యంలో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ వాసులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిజామాబాద్
ఉపాధి కోసం రష్యాకు వెళ్లి అక్కడి సైన్యంలో చిక్కుకుని దుర్భర జీవితాలు గడుపుతున్నామని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు పదిహేను వందల మంది రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏజెంట్ల మోసంతో బలవంతంగా సైన్యంలో చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న తమ వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని సీఎం ప్రజావాణిలో అధికారులను వేడుకున్నారు.