ఆండ్రాయిడ్ వినియోగదారులకు CERT-In కీలక భద్రతా హెచ్చరిక!
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ 14 నుంచి 17 వెర్షన్ల వరకు ఉన్న ఫోన్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉన్నందున, వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను తాజా సెక్యూరిటీ ప్యాచ్లతో అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించింది.